నందలూరు మండలంలో మహానాడు ప్రోగ్రాం ఈ నెల 27,28
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో హైబ్రిడ్ మహా నాడును విజయవంతం చేస్తాంనారా లోకేష్ నాయ కత్వంలో నిర్వహించ బడుతున్న హైబ్రిడ్ మహానాడును విజయ వంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పార్టీనాయకులు పిలుపు నిచ్చారు. ఈ మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ అవుతా యని తెలిపారు.అలాగే, యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఐక్యంగా పనిచేసి మహానాడును విజయ వంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోమండలం లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహా నాడుకు సంపూర్ణ జయప్రదం చేయవలసిందిగా ప్రజా సమస్యల పరి ష్కారం,అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం పార్టీ కట్టుబడి ఉందని నందలూరు మండల పార్టీ అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య వెల్లడించారు.