నకిరేకల్‌లో జూన్ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభటీ
యూడబ్ల్యూజే (ఐజేయూ) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి వెల్లడి
జనం న్యూస్ -మే 26- నాగార్జునసాగర్ టౌన్-జూన్ 3వ తేదీన నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ఉమ్మడి జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే – ఐజేయూ) నల్లగొండ జిల్లా మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు,జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు,మంగళవారం ఉదయం నల్లగొండలో నిర్వహించిన ఒక ముఖ్య సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు,ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా నకిరేకల్ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ వేముల వీరేశం,తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌కు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల ప్రతినిధులు,ఫోటో జర్నలిస్టులు,వీడియో జర్నలిస్టుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ,యూనియన్ సభ్యులంతా క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొని సభ్యత్వ నమోదును విజయవంతం చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,ఈ నెల 27వ తేదీ (బుధవారం) సాయంత్రంతో సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుంది, జిల్లాలో ఇంకా ఎవరైనా సభ్యత్వం తీసుకోని జర్నలిస్టులు ఉంటే,వెంటనే స్థానిక మండల, నియోజకవర్గ, జిల్లా నాయకులు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.జిల్లాలోని ప్రతి జర్నలిస్టు హక్కుల రక్షణ కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని గార్లపాటి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాలు,ఇంటి నిర్మాణం,హెల్త్ కార్డులు,అలాగే అక్రిడిటేషన్ కార్డుల సాధన కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇందుకోసం నిరంతరం పోరాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.అని తెలిపారు.