రోడ్డు ను ఆక్రమించారా ఖబ్జా పెట్టారా

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 27 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఒకప్పుడు ఇరువైపులా ప్రజలు సులభంగా రాకపోకలు సాగించిన రహదారి… ఇప్పుడు రోడ్ కు అడ్డంగా నిర్మాణం చేపట్టడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమనాద్రి కళాశాల ముందు రహదారిపై అడ్డంగా నిర్మాణం చేపట్టడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. “ప్రజా రహదారిని ఎవరి అనుమతితో ఆక్రమించార అన్న ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి స్థానికుల వాదన ప్రకారం గతంలో ఈ రహదారి ప్రస్తుతం ఆక్రమణల కారణంగా క్రమంగా మూసుకుపోయింది.రోడ్డు కు ఉండాల్సిన ఖాళీ స్థలాన్ని ఖబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు దీనివల్ల పాదచారులకు అటువైపు వెళ్ళడానికి నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు అత్యంత కీలకమైన విషయం ఏమిటంటీ ఈ నిర్మాణం సాధారణ వ్యక్తిదా లేక అధికార పార్టీకి చెందిన నాయకుడిదా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి సాధారణ ప్రజలు చిన్న షెడ్ వేసినా అధికారులు వెంటనే స్పందిస్తార మరి ఇంత పెద్ద నిర్మాణం జరుగిన ఎందుకు మౌనం పాటిస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార యంత్రాంగం వ్యవహార శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోడ్డు ఆక్రమణలు కేవలం భూవివాదం కాదు ప్రజల హక్కులపై దాడి. ప్రభుత్వ భూమి రహదారి స్థలం ఎవరికి చెందిన వ్యక్తిగత ఆస్తి కాదు. అయినప్పటి కీ రాజకీయ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయి సర్వే నిర్వహించి అసలు రహదారి పరిమాణం ఎంత ప్రస్తుతం ఎంత మిగిలింది ఆక్రమణ జరిగిందా లేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరేది ఒక్కటే పక్షపాతం లేకుండా విచారణ జరగాలి ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఉంటే వెంటనే తొలగించాలిఎవరు ఎంత పెద్ద నాయకుడైనా చట్టం ముందు సమానమనే విషయాన్ని అధికారులు నిరూపించాలి లేకపోతే అధికార పార్టీ నాయకులకు ఒక చట్ట సామాన్య ప్రజలకు మరో చట్టం అన్న విమర్శలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది

🌐 Select Language:
📰 ePaper