జనం న్యూస్ 15 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న కారును లారీ తో ఢీ కొట్టి న ఘటన తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ గంగాధర్ బీసీల కోసం బీసీల రాజ్యం కోసం పోరాడుతున్న నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. బడుగు బలహీన వర్గాలకు వెన్నంటే ఉంటానని హామీ ఇస్తూ ముందుకు వెళుతున్న పాదయాత్రలో భాగంగా బీసీ లకోసం పాదయాత్ర చేయడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తూ బీసీ రాజ్యం రావాలని అట్టడుగు ప్రజలకు చైతన్యం రావాలని పిలుపునిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో చైతన్యం రావడం కోసం ఈ పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పాదయాత్రను ఆపడం అగ్రకులాలు ఏకమై ఆయన కారును లారీ తో ఢీ కొట్టించారు. అని ఈ ప్రమాదం చేసినటువంటి లారీ డ్రైవర్ పై అలాగే చేయించినటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎంతటి వారీనైనా వదలకుండా చట్ట ప్రకారంగా శిక్ష పడేలా చూడాలని అదనపు ఎస్పీ కి మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇంచార్జ్ వి జేరాము, అయిజ మండల ఉపాధ్యక్షులు భీమేష్, మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ, మండల సలహాదారుడు బసవ స్వామి, తిరుమలేశ్, గట్టు మండలం యూత్ అధ్యక్షులు నాగేష్ నాయక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.