తెలంగాణ

ఏర్గట్ల మల్లన్న ఆలయం వద్ద ఐమాక్స్ లైట్ల ఏర్పాటు రూ.1.50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో లైట్ల ఏర్పాటు.. ముత్యాల సునీల్ కుమార్‌కు యాదవ సంఘం కృతజ్ఞతలు

ఏర్గట్ల మల్లన్న ఆలయం వద్ద ఐమాక్స్ లైట్ల ఏర్పాటు రూ.1.50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో లైట్ల ఏర్పాటు.. ముత్యాల సునీల్ కుమార్‌కు యాదవ సంఘం కృతజ్ఞతలు

జనం న్యూస్ నవంబర్ 15: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ మల్లన్న స్వామి ఆలయం వద్ద ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని యాదవ సంఘం సభ్యులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.1.50 లక్షలు మంజూరు చేయించి లైట్ల ఏర్పాటుకు సహకరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను యాదవ సంఘం సభ్యులు కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో వెలుగులు నింపేందుకు సహకరించిన ముత్యాల సునీల్ కుమార్‌కు యాదవ సంఘం పెద్దలు, సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఇ-పేపర్