జనం న్యూస్ 15 నవంబర్ ఆదివారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ సిద్దిపేట భారత్ నగర్లోని శ్రీవాణి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణతో పాటు వివిధ రకాల వేషధారణల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు, నృత్యాలు అందరినీ అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ.. పిల్లలంటే ఎంతో ఇష్టపడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 16వ సంవత్సరంగా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవత్వం అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులే జీవితానికి నిజమైన పునాదులని తెలిపారు. ప్రతి విద్యార్థి సత్ప్రవర్తనతో, సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.