జనం న్యూస్ నవంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి గురుస్వామి 24వసారి ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు.ఈ సందర్భంగా అర్చకులు యోగేశ్వర శర్మ మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి అత్యంత పవిత్రత, విశిష్టత ఉన్నాయని తెలిపారు. ఇరుముడిని భక్తిశ్రద్ధలతో తలపై ధరించి, గురుస్వామి సూచనలు పాటిస్తూ శబరిమల చేరుకోవాలని సూచించారు. ఇరుముడిలోని ముందుముడి స్వామివారికి, వెనుకముడి భక్తుడికి సంబంధించినవని వివరించారు.అయ్యప్ప నామస్మరణతో నియమ నిష్ఠలు పాటిస్తూ యాత్రను కొనసాగించాలని, స్వామివారి కృపతో యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గురుస్వామితో పాటు సీనియర్ పాత్రికేయులు బాలరాజు నాగరాజు రవీందర్ రెడ్డి మునీశ్వర్ తదితర అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు.