ఆంధ్రప్రదేశ్

బాలసాహిత్యం అంతటా చేరాలి

బాలసాహిత్యం అంతటా చేరాలి

జనం న్యూస్ 14 నవంబర్ శనివారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి బాల సాహిత్యం ఎంతో అవసరమని అట్టి బాల సాహిత్యం ప్రతి బాలలకు అందేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందని ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, కవి కాల్వ రాజయ్య, నూనె రాజయ్యలు అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బాలసాహిత్య కృషి చేస్తున్న రచయితలకు ప్రోత్సాకంగా వారి రచనలను ప్రతి విద్యార్థికి చేరేలా ప్రతి ఒక్కరు పాటుపడాలని, సామాజిక మాధ్యమాల కంటే పుస్తక పఠనం ద్వారా ఎల్లకాలం బాలల వికాసానికి బాల సాహిత్యం తోడ్పడుతుందన్నారు. అనేక ప్రక్రియలలో నేడు బాలలు రచనలు చేస్తుండడం అభినందనీయమన్నారు. కల్మషం లేనటువంటి బాలల కోసం ఇంత చేసిన తక్కువేనన్నారు.

ఇ-పేపర్