ఆంధ్రప్రదేశ్

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 14. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుపాడులో 1996–97 పదో తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో వరుసగా మూడో ఏడాది బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. చేతిరాత పోటీలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో క్యాలిగ్రఫీ పోటీలు. క్రీడా పోటీలు పరుగు పందెం, షాట్‌పుట్, లాంగ్ జంప్ పోటీలు బాలబాలికలకు జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించారు. వాలీబాల్ ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ప్రత్యేక పోటీలు గణితం, సైన్స్‌లో బోధనా నైపుణ్యాల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు 1996–97 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ పఠాన్ ఫిరోజ్ ఖాన్, వైస్ చైర్మన్ హెచ్. మాధవి పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. పూర్వ విద్యార్థుల సేవలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ఇ-పేపర్