జనం న్యూస్ 14 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్కా ర్మిక సంక్షేమ నిధులను పక్కదారి పట్టించడం ఆపాలి పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలి ఖాళీగా ఉన్న కార్మిక శాఖ పోస్టులను భర్తీ చేయాలి – ఏఐటీయూసీ జిల్లా నాయకుల డిమాండ్.జోగులాంబ గద్వాల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సహాయ కార్మిక అధికారి (ఏ సి యల్ ) వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రంగన్న, కోశాధికారి ఆశన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన కోట్లాది రూపాయల నిధులను సిఎన్సి హెల్త్ కేర్ సెంటర్లు, రక్త పరీక్షలు, ఐటీ సెంటర్ల నిర్మాణం పేరుతో పక్కదారి పట్టించడం సరికాదన్నారు.సహజ మరణాలు, ప్రమాద మరణాల పరిహారాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, జూలై 2026తో బీమా ఒప్పందం ముగిసినప్పటికీ కార్మికుల నుంచి క్లెయిమ్‌లు స్వీకరించి ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమన్నారు. ఇందిరమ్మ బీమాలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఆధార్ అప్డేట్ పేర్ల సవరణ రెన్యూవల్ వంటి అధికారాలను స్థానిక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లకు కల్పించకుండా రాష్ట్ర బోర్డు వద్దే ఉంచడం వల్ల కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. నెలల తరబడి క్లెయిమ్‌లు పెండింగ్‌లో పెట్టి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సేవా కేంద్రాల వద్ద పెరిగిపోతున్న దళారీ వ్యవస్థను అరికట్టి నిజమైన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్లు: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. పెండింగ్‌లో ఉన్న మరణ, ప్రమాద, ఇతర సంక్షేమ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. ఆధార్ అప్డేట్, పేర్ల సవరణ రెన్యూవల్ అధికారాలను స్థానిక అధికారులకు కల్పించాలి. కార్మికుల అడ్డాల వద్ద షెడ్లు నిర్మించి, కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందించాలి. 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి. సిఎన్సి హెల్త్ టెస్టుల పేరుతో నిధుల ఖర్చును నిలిపివేయాలి. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.కార్మికుల చెమటోడ్చి సంపాదించిన సంక్షేమ నిధులు కార్మికులకే ఖర్చు చేయాలని వారి హక్కులను హరించే విధానాలను ప్రభుత్వం విడనాడాలని నాయకులు హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్జో గులాంబ గద్వాల జిల్లా కమిటీ