జనం న్యూస్, నవంబర్ 14,అచ్యుతాపురం : అచ్యుతాపురం శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కే కుసుమకుమారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల అలంకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి గ్రంథాలయాలకు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు పుస్తక పఠనం వలన మానసిక ఏకాగ్రత మంచి నడవడిక అలవడుతుందన్నారు. ప్రపంచంలో ఎంతో మేధావులను చూసిన వారంతా గ్రంథాలయాలను ఉపయోగించుకున్న వారు అన్నారు గ్రంథాలయాధికారి మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించే వారోత్సవాలలో విద్యార్థులంతా వివిధ పోటీలలో పాల్గొని వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్యుత పాఠశాల ఉపాధ్యాయులు చిరంజీవి గ్రామీణ గ్రంథ పాలకులు డి కోటేశ్వరరావు పాటకులో పి శివకృష్ణ , ఎన్ నరేంద్ర , ఎం రాజేష్ మరియు విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.