తెలంగాణ

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం 23వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం 23వ వార్షికోత్సవ వేడుకలు

అధిక సంఖ్యలో భక్తులకు అన్నప్రసాద వితరణ జనం న్యూస్ నవంబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధిలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం 23వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి. స్వామి గౌడ్, ఎస్సై రవీందర్ రెడ్డి, మహిళా ఎస్సైలు స్రవంతి, స్వాతి, మాజీ కార్పొరేటర్ రోజాదేవి, గొట్టుముక్కుల పెద్ద భాస్కర్ రావు, వెంకట్రావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు జి. రవీందర్ కుమార్, లావణ్య దంపతులు వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, సునీత దంపతుల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రామకృష్ణ వీధి కాలనీవాసులపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జి. రామచంద్రరావు, చంగల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీధర్, జి. ప్రసాద్, వెంకటేశ్వరరావు, కిషోర్, పురుషోత్తం, సుధాకర్, ఆర్. కార్తీక్, స్వామి, అశ్విత్, నందు, సాయి, భార్గవ్, సుబ్బారెడ్డి, మహేందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో లావణ్య, ఉష, సుహాసిని, మంజుల, లక్ష్మి, అన్నపూర్ణ, కరుణ, పద్మజ, శ్రీలత, సునీత తదితరులు సేవలందించారు. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పోలీసు అధికారులకు, కాలనీవాసులకు, దేవాలయ కమిటీ సభ్యులకు, భక్తులకు దేవాలయ కమిటీ అధ్యక్షులు జి. రవీందర్ కుమార్, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి నామస్మరణ, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణతో రామకృష్ణ వీధిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఇ-పేపర్