జనం న్యూస్ 14 నవంబర్ శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేట మండలం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయములో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా, వివిధ ఉన్నతాధికారులుగా మారి పాఠశాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఒకరోజు పరిపాలనలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి గా కృతిక్ , ప్రిన్సిపాల్ గా రఘు వర్ధన్ కరెస్పాండెంట్ గా మణికంఠ వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతి గదులకు వెళ్లి తోటి విద్యార్థులకు ఎంతో చక్కగా పాఠాలను బోధించారు. అనంతరం జరిగిన సభలో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, అంకితభావం పట్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమం చివరలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయినిలు రత్నమాల భాగ్యమ్మ ఫిర్దోజ్ కృష్ణవేణి సృజన మానుష భారతి పాల్గొన్నారు.