ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ జోక్యాన్ని నివారించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ జోక్యాన్ని నివారించాలి

జనం న్యూస్ 14 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ప్ర భుత్వ ఉత్తర్వుల మేరకు సెంటర్లు నిర్వహించాలి సి ఐ టి యు డిమాండ్ధా న్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ జోక్యాన్ని నివారించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివోఏ లను ఇన్చార్జిలుగా నియమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పజెబుతు వివోఏ లను ఇన్చార్జిలుగా నియమించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో గత కొంతకాలంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారి రాజకీయ అనుచరులను అడ్డం పెట్టుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రాజకీయ జోక్యం పెరగడం వల్లే తరచు అధికార ప్రతిపక్షాల మధ్య గొడవలు జరుగుతున్నాయని కావున ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివోఏ ఇన్చార్జిలుగా నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కొంతమంది సీసీలు ఉద్దేశపూర్వకంగా, కారణం లేకుండా వివోఎల గ్రేడింగ్ పోగొడుతూ వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జాబ్ చార్ట్ లో లేని అనేక రకాల పనులు వివోఏ లతో చేయిస్తూ వేధింపులకు గురి చేస్తున్న సీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న వివోఏ లను సమీకరించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఏ ల సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాం అంజి,కార్యదర్శి తిమ్మప్ప జిల్లా అధ్యక్షుడు వెంకటరామయ్య, సహాయ కార్యదర్శులు సరస్వతి ఎం శ్రీనివాస్ వివోఏలు లక్ష్మన్న గోవిందమ్మ,రుతమ్మ,రాధమ్మ, సరస్వతి పావని లక్ష్మి,నారాయణ సత్యన్న తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలతో డ్యాం అంజి ఐకేపీ వివోఏ సంఘం జిల్లా అధ్యక్షుడు

ఇ-పేపర్