మరొకరు పరారీ- క్రైమ్ నం. 674/2026, సెక్షన్లు 331(4), 305(ఎ ), 317(2) బి ఎన్ ఎస్ , ఘట్కేసర్ పోలీస్ స్టేషన్

( జనం న్యూస్ ) 26 నవంబర్ మేడ్చెల్ జిల్లా ఎం ఎం సి ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామం, లేక్ వ్యూ ఎన్క్లేవ్, వైష్ణవి రెసిడెన్సీలో జరిగిన ఇంటి దొంగతనం కేసును ఘట్కేసర్ పోలీసులు విజయవంతంగా ఛేదించి, ఈ కేసులో ప్రమేయం ఉన్న 10 మంది నిందితులను 24.11.2026న యంనంపేట్ ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.కేసు వివరాలు: ఫిర్యాదుదారుడు వి. నవీన్ కుమార్ (45), తన భార్య, కుమార్తెతో కలిసి 14.11.2026న మధ్యాహ్నం సుమారు 3:00 గంటలకు ఇంటికి తాళం వేసి, ప్రమాదానికి గురైన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బోడుప్పల్‌కు వెళ్లాడు. అక్కడే తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. 18.11.2026న ఉదయం 7:45 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, డైనింగ్ హాల్ పక్కన ఉన్న కిటికీ తెరిచి ఉండటాన్ని గమనించాడు. పరిశీలించగా కిటికీని పగలగొట్టి ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం బెడ్రూమ్లోని బీరువాను పరిశీలించగా అది తెరిచి ఉండటంతో పాటు అందులో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 18 తులాల బంగారు ఆభరణాలు, వాటి విలువ సుమారు రూ.3,60,000/- చోరీ చేసినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 674/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల వివరాలు:1. కె సామెల్ @ నాని @ సంబల్ , వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: గాంధీనగర్, ఘట్కేసర్.2. పిట్టల ఉమర్ @ షైక్ ఉమర్ , వయస్సు 18 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: గాంధీనగర్, ఘట్కేసర్.3. షైక్ సద్దాం షరీఫ్ , వయస్సు 21 సంవత్సరాలు, నివాసం: బాలాజీనగర్, ఘట్కేసర్.4. పిట్టల పాపితే , వయస్సు 33 సంవత్సరాలు, వృత్తి: గృహిణి, నివాసం: గాంధీనగర్, ఘట్కేసర్.5. మార్కలా సాయి కుమార్ , వయస్సు 21 సంవత్సరాలు, వృత్తి: పండ్ల వ్యాపారి, నివాసం: గాంధీనగర్, ఘట్కేసర్.6. ఎస్ డి . సిద్ధిఖ్ , వయస్సు 22 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, నివాసం: షేక్‌పేట్.7. నొకటాల మోతిలాల్ , వయస్సు 29 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: మైసమ్మగుట్ట కాలనీ, ఘట్కేసర్.8. నొకటాల శబ్బు , వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి: గృహిణి, నివాసం: మైసమ్మగుట్ట కాలనీ, ఘట్కేసర్.9. శక్తి విశాల్ , వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: చిలకలగూడ, సికింద్రాబాద్.10. గానశాల రైలోన్ మాక్స్ , వయస్సు 20 సంవత్సరాలు, వృత్తి: క్యాటరింగ్ పని, నివాసం: ఉపమాక గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్.పరారీలో ఉన్న నిందితుడు:11. మానుశాల వెంకటేష్ , వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి: కార్ మెకానిక్, నివాసం: తుని, అనకాపల్లి జిల్లా.స్వాధీనం చేసుకున్న సొత్తు:నిందితుల వద్ద నుంచి క్రింది బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.1. బంగారు నెక్లెస్ – సుమారు 1.4 తులాలు.2. బంగారు బుట్ట కమ్మలు – సుమారు 1.5 తులాలు.3. బంగారు చంద్రహారం – సుమారు 2 తులాలు.4. బంగారు జడపువ్వు – సుమారు 0.5 తులాలు.5. బంగారు గొలుసు – సుమారు 1 తులం.6. రెండు బంగారు ఉంగరాలు – సుమారు 0.8 గ్రాములు.7. విరిగిన పొడవాటి బంగారు గొలుసు – సుమారు 2.8 తులాలు.8. వెండి ఆభరణాలు – సుమారు 24 తులాలు.9. రెండు ఐఫోన్లు (ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ) – విలువ సుమారు రూ.1,05,000/-.10. నగదు – రూ.53,000/-.నిందితుల నేర విధానం:ప్రాథమిక దర్యాప్తులో A-1 మరియు A-2 అలవాటుపడిన ఆస్తి నేరస్తులుగా గుర్తించబడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి దొంగతనాలకు పాల్పడేందుకు ప్రణాళిక రూపొందించి, ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, కిటికీలు లేదా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.పోలీసు అధికారుల కృషి:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, IPS గారి సమర్థవంతమైన నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. కిరణ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. రాఘవేంద్ర మరియు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సాంకేతిక ఆధారాలు మరియు నిరంతర దర్యాప్తు ద్వారా ఈ కేసును విజయవంతంగా ఛేదించారు.ఈ ఆపరేషన్‌లో- R. రాజేష్, హెచ్ సి -4181 – P. విజయ్ కుమార్, హెచ్ సి-4126- P. రాజు, పి సి -11085- N. నరేష్, పి సి-4341- నరేందర్, పి సి-4344- B. సైదులు, పి సి-3689- B. మహేశ్వరి, డబ్ల్యూ పి సి-10285- B. శ్రీను, హెచ్ జి -722 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో విశేష కృషి చేసిన ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీస్ అభినందించారు.ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని ప్రజలకు సూచనలు ఇచ్చారు.