ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

రూ.5 లక్షల జీవిత బీమాతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా జనం న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం నమోదు ప్రక్రియ 2026 నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జీవిత బీమా కల్పించడం ద్వారా అనుకోని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కావలసిన ధ్రువపత్రాలు: 1.బీమా చేయించుకునే వ్యక్తి ఆధార్ కార్డు జిరాక్స్. 2.ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్. 3.తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత (రేషన్) కార్డు. 4.కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు. 5.నామినీ ఆధార్ కార్డు వివరాలు. 6.నామినీ మైనర్ అయితే సంరక్షకుడి వివరాలు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబం అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకొని, సమతానగర్ కాలనీలో కేంద్రీయ విహార్ సమీపంలో ఉన్న సి.ఎం.సి. వార్డు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అక్కడ సంబంధిత అధికారులను కలిసి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యం. ప్రజలకు అండగా ఉండటమే మా బాధ్యత. కావున హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్