జనం న్యూస్ 26 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్తె లంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వి జై రాము మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందా నిన్న రాత్రి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు ఓ బైక్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అసలు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తగిన రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు ప్రమాద సూచిక బోర్డులు హెచ్చరిక లైట్లు బారికేడ్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిర్మాణ పనులు కొనసాగడం ఎంతవరకు సమంజసం ఒక నిండు ప్రాణం పోయిన తర్వాతే అధికారులు పాలకులు స్పందిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే అభివృద్ధి పనుల ప్రచారమే ముఖ్యమా ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుడి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలి. ఇకనైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు మేల్కొని నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల వద్ద తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించలేని పాలనపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదే విధంగా జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి రేపు రాబోతున్న మంత్రులను అడ్డుకోవడానికి సిద్ధంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది అని తెలియజేశారు.