జనం న్యూస్ 26 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్తె లంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సిందనూర్ గంగాధర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజానీకానికి ఈరోజు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రాజ్యాధికారం రావాలని నిదానంతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చైతన్యం తీసుకురావడం కొరకు ఆయన ముందడుగు వేశారు. ఆయనతో కలిసి నడవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చైతన్యం తీసుకురావడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇన్చార్జి విజై రాము జిల్లా వికలాంగుల అధ్యక్షులు టి భీమన్న ముదిరాజ్ బి ఇ డి పి జి అయిజ మండల ఉపాధ్యక్షులు సి భీమేష్ రాముడు వి పురుషోత్తం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.