చెయ్యేరులో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ రాజేశ్వర్ రావు
జనం న్యూస్ మే 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండలంచెయ్యేరు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ (MGNREGS) పనులను శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) & ప్రోగ్రాం అధికారి బి. రాజేశ్వర్ రావు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా పనుల వద్ద వేతనదారుల వారీగా మస్టర్లను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం క్షేత్ర సహాయకుడు (FA) శ్రీరామను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో శ్రామికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా నీడ మరియు తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ శ్రామికులతో ఆయన మాట్లాడుతూ.. ఎండలు అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ఇదే సమయంలో ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కూడా గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలీలందరూ పూర్తి స్థాయిలో పనుల్లో పాల్గొనేలా చూడాలని, అలాగే సరాసరి వేతనం అధికంగా వచ్చే విధంగా తగిన చర్యలు చూపాలని టెక్నికల్ అసిస్టెంట్ (TA) లావణ్యను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, మేట్లు మరియు శ్రామికులు పాల్గొన్నారు.