ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: అయిత రత్నాకర్
జనం న్యూస్: 30 మే ఆదివారం; సిద్దిపేట నియోజక వర్గ ఇంచార్జి వై రమేష్ ;తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అయిత రత్నాకర్ నియామకం సిద్దిపేటకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు అయిత రత్నాకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. హైదరాబాద్‌లోని మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అయిత రత్నాకర్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధి, విద్యార్థుల ఉన్నత విద్య, స్వయం ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం మరియు సమాజ ఐక్యత కోసం మరింత కృషి చేస్తానన్నారు. ఆయన నియామకంపై జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్య నాయకులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.