మరో ఐదు రోజుల్లో ధాన్య కొనుగోళ్లు పూర్తి పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

June 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 02జూన్ పెగడపల్లి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం నామాపూర్ లో నందగిరి పి ఎ సి ఎస్ ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని మండల నాయకులతో కలిసి సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 95% కొనుగోళ్లు పూర్తి చేశామని రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మిల్లర్లకు వరి ధాన్యం తరలించిన వెంటనే ఆన్లైన్ చేయడంతో 24 గంటల్లోపు రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుందనిఅదేవిధంగా రాబోవు ఐదు రోజులలో మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మిగతా వరి ధాన్యం పూర్తిగా తూకం వేసి మిల్లర్లకు తరలిస్తామని తెలిపారు.ఒకవేళ వర్షం కురిసి దాన్యం తడిసినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ నాయకులు సందీ మల్లారెడ్డి ఆకుల విష్ణు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు నిర్వాహకులు శ్రీనివాస్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper