మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మనుచౌదరి తో కలిసి వేడుకల్లో పాల్గొన్న బండి రమేష్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి పథంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. వేడుకలు దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.