గద్వాల: పూడూరులో అనుమతులు లేకుండా చెరువు మట్టి తరలింపు ఇటుక బట్టీల మాఫియా హల్చల్
జనం న్యూస్ 03 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరిధిలోని పూడూరు గ్రామ పరిసరాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువుల నుండి ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు యథేచ్ఛగా తరలిస్తూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. తాజాగా పూడూరు పరిధిలోని రహదారిపై భారత్‌బెంజ్ భారీ టిప్పర్ల ద్వారా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి నిబంధనలు బేఖాతరు పగలు రాత్రి తవ్వకాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు మట్టిని కేవలం రైతుల పొలాల సారవంతం కోసమే ఉపయోగించాలి వాణిజ్య అవసరాలకు తరలించాలంటే మైనింగ్ ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల నుండి ముందస్తు అనుమతులు పర్మిట్లు తప్పనిసరి. కానీ పూడూరు పరిసరాల్లోని ఇటుక బట్టీల నిర్వాహకులు కొందరు అక్రమార్కులు చేతులు కలిపి రాత్రి పగలు తేడా లేకుండా భారీ హిటాచీలతో తవ్వకాలు జరుపుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తీవ్ర దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ కరువైందా మండల కేంద్రానికి సమీపంలోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగు తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి మాఫియా ధాటికి చెరువుల ఉనికి ప్రమాదంలో పడుతోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందు తున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలన డిమాండ్ఇప్పటికైనా గద్వాల నియోజకవర్గ ఉన్నతాధికారులు మైనింగ్ మరియు పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాలని పూడూరు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడు తున్న భారీ వాహనాలను సీజ్ చేయాలని నిబంధనలు ఉల్లంఘించిన ఇటుక బట్టీల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ సంపదను కాపాడాలని కోరుతున్నారు