వాల్బపూర్‌లో కరీంనగర్ పాల డైరీ సేకరణ కేంద్రం ప్రారంభం పాడి రైతులకు ఊరట
జనం న్యూస్, జూన్ 3 ( జిల్లా ఇంచార్జ్ )వీణవంక మండలం వాల్బపూర్ గ్రామంలో కరీంనగర్ పాల డైరీ సేకరణ కేంద్రాన్ని డైరీ చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి పాల డైరీలు కీలకంగా పనిచేస్తాయని, రైతులు నాణ్యమైన పాల ఉత్పత్తితో ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలడైరి అధ్యక్షుడు పల్లె స్వామి, సర్పంచ్ శ్రీమతి కుమార్, మాజీ సర్పంచ్ కొమురయ్య, ఉపసర్పంచ్ విజేందర్, పాడి రైతులు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాల సేకరణ కేంద్రం ప్రారంభం కావడంతో గ్రామంలోని పాడి రైతులకు పాల విక్రయానికి సౌకర్యం కలగడంతో పాటు మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.