నియోజకవర్గ అధ్యక్షులుగా వడ్లపల్లి వెంకటేశ్వర రెడ్డి ఎన్నిక
రాష్ట్ర,జిల్లా నాయకత్వ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
జనం న్యూస్ – జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే – ఐజేయు నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా వడ్లపల్లి వెంకటేశ్వర్లు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుధవారం నకిరేకల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా స్థాయి మహాసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా,సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా వడ్లపల్లి వెంకటేశ్వర రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి, నియోజకవర్గ జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం,సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నిక పట్ల స్థానిక జర్నలిస్టులు,పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.