కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్‌కు ఘన సన్మానం

June 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్పీక్ (సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్) సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బండి రమేష్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.సంస్థ ప్రతినిధులు అన్నే సత్యనారాయణ, డాక్టర్ గోపాలం విద్యాసాగర్, అట్టేపల్లి రామప్రభు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పరుచూరి మురళిని కూడా సత్కరించారు. పెద్ద సంఖ్యలో కమ్మ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరై నూతన బాధ్యతలు చేపట్టిన బండి రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కమ్మ కార్పొరేషన్ ద్వారా కులంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా బండి రమేష్ ప్రత్యేక చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధి, యువత సాధికారత, విద్యా మరియు ఉపాధి అవకాశాల కల్పనలో కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ మురళీకృష్ణ, సాయిబాబా చౌదరి, తూము వినయ్, దోనేపూడి చక్రపాణి, వాసిరెడ్డి నరేష్, మన్నె నాగమల్లేశ్వరి, చిట్టి వీరయ్య, రమేష్, విజయసారధి, తార్నాక కమ్మ సంఘం సభ్యులు డాక్టర్ హరి చౌదరి, కొణిదల లక్ష్మీనారాయణ, ఉపేంద్ర, మల్లిబాబు, వీరబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper