ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందాలి.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

June 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్ని. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వివిధ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామసభల ప్రధాన ఉద్దేశ్యం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడమేనని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు.గ్రామ స్థాయి నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వైనాల విజయ-కుమారస్వామి, తహసిల్దార్ ఆర్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణి చంద్ర, ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శని, ఎంపీఓ బుర్ర రంజిత్ గౌడ్, ఏపీఎం వేణుగోపాల్, పత్తి పాక గ్రామ మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి నాయకులు దుబాసి కృష్ణమూర్తి కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper