సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మయ్య జన్మదిన వేడుకలు

June 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య జన్మదిన వేడుకలు గురువారం శ్రీ హేమ దుర్గా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై లక్ష్మయ్య చేత కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ నాయకులకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు, పదవులు లభించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఆయన ప్రజాసేవా దృక్పథం యువతకు ఆదర్శమని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సాయిబాబా చౌదరి, ధర్మరావు, మస్తాన్ రెడ్డి, కనకయ్య, పిడికిటి గోపాల్ చౌదరి, కామినేని వాసు, మేకల మహేష్, నసీర్, మోహన్ నాయక్, బండి సుధా, సంధ్య, కల్పన, అపర్ణ, జయలక్ష్మి, రాజేశ్వరి, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, దానలక్ష్మి, రజని, నాగమణి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని లక్ష్మయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper