ముచ్చోనిపల్లి రిజర్వాయర్ వద్ద యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
జనం న్యూస్ 11 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పరిధిలోని ముచ్చోనిపల్లి రిజర్వాయర్, 109 ప్యాకేజీ అలుగు వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు అనధికారికంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా సాగిస్తున్న ఈ అక్రమ దందాపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.స్పందించని స్థానిక యంత్రాంగం ఈ అక్రమ మట్టి రవాణాపై గద్వాల ఆర్డీఓ గట్టు తాసిల్దార్ (యం ఆర్ ఓ) మరియు గట్టు ఎస్ఐ (యస్ ఐ ) లకు స్థానికులు పూర్తి సమాచారాన్ని అందించారు. అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వాట్సాప్ ద్వారా అధికారులందరికీ పంపినప్పటికీ, వారు చూసిచూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదులు అందినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు జరుపుతున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముచ్చోనిపల్లి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు