ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలపై సమీక్ష నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జనం న్యూస్, మే 11, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు, ఫలితాల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యా రంగ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు, ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ ఎంఈఓలు కోరుట్ల నరేష్,మల్లాపూర్ దామోదర్ రెడ్డి, మెట్ పల్లి కనకతార, ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు..