కేజీబీవీ సక్సెస్ మీట్ అడ్మిషన్ మేళా*
జనం న్యూస్ జూన్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి :శాయంపేట మండలంలోని గోవిందా పురం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో “కేజీబీవీ సక్సెస్ మీట్ అడ్మిషన్ మేళా–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా లింగ,సమానత్వ సమన్వయకర్త (జీఈసీఓ) సముద్రాల సునీత… హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు స్పాట్ అడ్మిషన్లు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేజీబీవీల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, సౌకర్యాల గురించి వివరించారు.పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేజీబీవీలో చేరి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యశాఖ అధికారి జి.బిక్షపతి, ప్రత్యేక అధికారి(ఎస్ఓ) మాధవి, దాసి శ్రావణ్ కుమార్, గోవిందాపూర్ ఉప సర్పంచ్ కల్వల నరేందర్, మునుకుంట్ల వేణు, రంగు శ్రీధర్,కొత్తపెళ్లి నవీన్,సామల సూర్యప్రకాష్,తుడుం రవీందర్,క్రాంతి కుమార్, నరసయ్య,ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.