జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు ఆర్.ఎం.పి. కేంద్రాల తనిఖీ:-డాక్టర్ శరత్ కమల్

June 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 14-06-26 నందలూరు మండలంలోని ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి , డాక్టర్ జె. ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు నందలూరు మండలంలోని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో శని వారం పలు ఆర్‌.ఎమ్.పి కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్‌.ఎమ్.పి లు కేవలం ప్రథమ చికిత్స కేంద్రాలు (ప్రథమచికిత్సా కేంద్రము) మాత్రమే నిర్వ హించాలని, ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి వైద్యం చేయడం, రోగులకు ఇంజక్షన్లు, ఐవి ఫ్లూయిడ్స్(సలైన్లు)ఎక్కించడం చట్ట విరుద్ధమని తెలియ జేసారు.తనిఖీల్లో పరిశీలించిన ముఖ్య అంశాలు : ఆర్‌.ఎమ్.పి లు తమ పేరు బోర్డుల ముందు ‘డాక్టర్’ అని బోర్డు ఏర్పాటు చేశారా లేదా అనేఅంశాన్ని పరిశీలించారు కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన సంస్థలు జారీ చేసిన ప్రథమ చికిత్స సర్టిఫికేట్ ప్రదర్శించారా లేదా, నిబంధనలకు విరుద్ధంగా బెడ్లు, ఐవి స్టాండ్లు, నెబ్యులైజర్లు నిర్వహించడం పైనిలదీశారు.అనుమతి లేకుండా సర్జరీలు, డెలివరీలు, అబార్షన్లు వంటి ప్రమాదకర వైద్య ప్రక్రియలు చేస్తున్నారా అనే కోణంలో రికార్డులను తనిఖీ చేశారు., నిబంధనలు ఉల్లంఘించి, పరిమితికి మించి అల్లోపతి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ – వెంకట నారాయణ, ఆరోగ్య పర్యవేక్షకుడు- సునీల్ , ఆరోగ్య సహాయకుడు మధుసూదన రెడ్డి ఎం.ఎల్.హెచ్.పి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper