తిమ్మారెడ్డిగూడెంలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

May 8, 2026 | వైరల్ వార్తలు

(జనం న్యూస్ కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెంలో 99 రోజుల ప్రజాప్రగతి కార్యక్రమంలో భాగంగా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో 36 మేలుజాతి పశువులు, దూడలకు వైద్యులు చికిత్స అందించారు.రైతులకు సబ్సిడీపై గడ్డి గింజలను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రక్షిత,డాక్టర్ భాస్కర్,డాక్టర్ మమత,డాక్టర్ హారిత,మండల వ్యవసాయ అధికారి రాజు,సైంటిస్ట్ రాములమ్మ,కెవికె మహిత, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper