పంట పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు

May 9, 2026 | వైరల్ వార్తలు

పొంచిఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు

జనం న్యూస్ 09 మే వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పంట పొలాల్లో చేతికి తాకేంత ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు, స్తంభాలు ఒరిగి విద్యుత్ తీగలు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. ఈ తీగల కింద వ్యవసాయం చేయాల్సి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళనతో పనులు చేయాల్సి వస్తోంది. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో వేలాడుతున్న కరెంటు తీగలను విద్యుత్ శాఖ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ సంబంధిత అధికారులు స్పందించి, స్తంభాలను ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలను వెంటనే సరి చేయాలని రైతులు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper