తెలంగాణ రైతులను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై మీడియా సమావేశంలో మండిపడిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

June 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 20 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రైతుల తరుపున బి ఆర్ యస్ పార్టీ పోరాడుతుంది గతంలో పిసిసి అధ్యక్షుడిగా అన్ని పంటలు ఎందుకు కొనరు అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి,ఇప్పుడు ఎందుకు చేతులేత్తేస్తున్నాడు గద్వాల నియోజకవర్గం పంటల కొనుగోలుపై సీఎం రేవంత్ కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని *జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి,బాసు హనుమంతు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు కొనుగోలు చేయకపోతే కేంద్రం మెడలు వంచుతామని మే 25న ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఏమైందని బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు దేశానికి అన్న పెట్టే రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఏడిస్తే,రాష్ట్రానికి మంచిదికాదని,వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రీమియం డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించక,ఎరువుల కోసం యాప్ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్యుత్ సరిగ్గా ఇవ్వక పోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమేనన్నారు..రోజుకో వింత నిర్ణయం,చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నేడుతోందని విమర్శించారు రైతుల పండించిన పంట ప్రభుత్వం కొనకపోతే ఆ పంటను రైతులు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు కేంద్ర కోటల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయా దక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు..రుణమాఫీ రైతుభరోసా రైతుబీమా,పంట బోనస్‌ కొనుగోళ్లు,నీటిసరఫరా,కరెంట్‌సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ ప్రభుత్వం రైతుకు తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు.వానాకాలం సీజన్‌ నిధులతోపాటు,పెండింగ్‌లో ఉన్న మూడు విడతల రైతుభరోసా బకాయిలు మొత్తం రూ.16,545కోట్లు ఈనెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు.కేంద్రం ఎంత అంటే అంత ధాన్యం మాత్రమే కొంటామని చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమన్నారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి రైతులను పాతాళంలోకి నెట్టేస్తారా కేంద్రంలోని బిజెపితో లోపాయికారి ఒప్పందలు చేసుకొని అన్నదాతలను నట్టేట ముచ్చుతారని,71 సార్లు ఢిల్లీ యాత్రలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట కొనుగోలపై ఒక్కసారైనా ప్రస్తావించారని ప్రశ్నించారు రాష్ట్ర సర్కార్ ఇంత దారుణంగా చేతులెత్తేస్తే ఇక 70 లక్షల మంది రైతులకు దిక్కెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాడెపడేసిన కాంగ్రెస్ సర్కారుకు రైతులు కర్రగాల్సి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని ఆన్నారు.బిఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈ రైతువ్యతిరేక ముఖ్యమంత్రిని,రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనకపోతే రైతులతో కలిసి బిఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, జీ.రాఘవేంద్ర రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, బీచుపల్లి,సూర్య గౌడ్,రాజారెడ్డి, మోనేష్,సోమశేఖర్ రెడ్డి,శ్రీరాములు,చక్రీధర్ రెడ్డి,తిమ్మప్ప గౌడ్,లక్ష్మారెడ్డి,వీరేష్ గౌడ్ సురేష్,గొనుపాడు మాలిక్,రమేష్,డ్యామ్ శ్రీను,జగదీశ్,రజిని బాబు,నరసింహులు వెంకటేష్,మహేష్,వీరేష్,రవి,మోహన్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper