ఘనంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభ నిర్వహణ

June 20, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, జూన్ 20,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోగల లేపాక్షి ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, చైర్మన్ బత్తుల తాతబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్, రోడ్డు డెవలప్మెంట్ చైర్పర్సన్ ప్రగడ నాగేశ్వరరావు,మాజీ చైర్‌పర్సన్ లాలం భవాని భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, భరత్. రాజాన సన్యాసి నాయుడు,రాజాన శేషు, బీజేపీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎస్‌టిబిఎల్ నుండి లేపాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోదీకి,సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గత రెండేళ్లలో ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని,ఎలమంచిలి నియోజకవర్గంలో గతంలో మాటలకే పరిమితమైన అభివృద్ధి నేడు కార్యరూపం దాల్చుతోందని పేర్కొంటూ, అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి అభివృద్ధి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపు తోందన్నారు. ఎలమంచిలి నియోజకవర్గ ప్రజలు తనను ఒక కుటుంబ సభ్యుడిగా, తండ్రిలా ఆదరిస్తున్నారని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వానికి అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కూటమి కార్యకర్తలకు ప్రత్యేక అధికారులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper