జర్నలిస్టుల సంక్షేమానికి టీవైజేఎఫ్ మరో ముందడుగు

June 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 20-06-2026 నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డా. తనుగుల జితేందర్ రావు ఆదేశానుసారంతెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీవైజేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీవైజేఎఫ్ సభ్యులకు ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీవైజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇబ్రాహీం, అబ్దుల్ జబ్బార్, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు జలీల్ రుస్తుం, ఉదయ్ పాటిల్, హెచ్. రాజు, నారాయణఖేడ్ కార్యదర్శి రెడ్డి వినోద్, నారాయణఖేడ్ ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్, కంగ్టి మండల అధ్యక్షుడు ఎన్. ప్రకాష్, ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, కంగ్టి మండల ప్రధాన కార్యదర్శి మజరుద్దీన్, నారాయణఖేడ్ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా ఉస్మాన్తో పాటు కంగ్టి మండల టీవైజేఎఫ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే టీవైజేఎఫ్ ప్రధాన ధ్యేయమని, సభ్యుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు, పిల్లల విద్యాభివృద్ధి కోసం ఉచిత విద్యా సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper