జహీరాబాద్ నియోజకవర్గంలోని 37వ వార్డులో కౌన్సిలర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూన్. 27. 06. 2026 మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ మైపాల్ యాదవ్ ఆధ్వర్యం వహించగా, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలను అందుకున్నారు. మహిళల సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని కౌన్సిలర్ మైపాల్ యాదవ్ తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలుస్తూ ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు కౌన్సిలర్ మైపాల్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి విజయవంతంగా ముగిసింది.