ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం
జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ఈరోజు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ఎస్ ఐ ఆర్ ను బి ఎల్ ఓ లు స్థానిక సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్ పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అఖిల పక్ష నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం బి ఎల్ ఓ లు ఎడ్ల ఉమారాణి, కుంటాల పద్మ, అనిత మాట్లాడుతూ నేటి నుండి జులై 24వ తారీకు వరకు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ సవరణ కార్యక్రమం చేస్తామని ప్రజలు దీనికి సహకరించి సంబంధిత అప్లికేషన్ ఫామ్స్ పూర్తి చేసి ఇవ్వాలని అలాగే బయట ఉన్న ఓటర్లు కచ్చితంగా ఊర్లో ఓటు హక్కు కలిగి ఉండాలంటే తప్పకుండా జూలై 23 తారీకు లోపు ఇక్కడకు వచ్చి ఫామ్ ఫిలప్ చేసి సంతకాలు చేయాల్సిందిగా వివరించారు. ఒక మనిషికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా ఫారం ఫిల్ అప్ చేసి ఇవ్వాలని అన్నారు 18సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఫారం 6 ఫిలప్ చేసి ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బుర్ర రాములు గౌడ్ కుంటాల విష్ణు అక్కెమ్ గంగాధర్ బి ఆర్ ఎస్ నుండి రంగు ప్రభాకర్ సల్కం మహేందర్ కొత్తపల్లి తిరుపతి బిజెపి నుండి సాయిల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.