ఆర్‌డీఎస్ ఎడమ కాలువ మరమ్మతులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి టి ఆర్ పి
జనం న్యూస్ 12 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ టీ ఆర్ పి రైతుల వినతిజోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ రైతులు ఆర్‌డీఎస్ రాజోలి బండ ఎడమ కాలువ మరమ్మతులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.రైతులు తెలిపిన వివరాల ప్రకారం, బచావత్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా ఉన్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా ఆర్‌డీఎస్ నీరు పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు గ్రామాలకు చేరడం లేదన్నారు. కాలువల్లో గండ్లు, లీకేజీలు, మట్టి పేరుకుపోవడం, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు, ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్‌డీఎస్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందాల్సిన వేలాది ఎకరాలు ప్రస్తుతం వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్నాయని, తల భాగ ప్రాంతాలకు మాత్రమే కొంతమేర నీరు అందుతుండగా చివరి గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా రైతులు అప్పుల పాలై ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వం ఆర్‌డీఎస్ నుంచి చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు లింక్ కెనాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం రైతుల్లో ఆశలు కలిగించిందని, ఈ నేపథ్యంలో ప్రధాన కాలువ మరియు ఉపకాలువల మరమ్మతు పనులను అత్యవసరంగా పూర్తి చేసి సాగునీరు సమర్థవంతంగా అందించాలని కోరారు.రైతులు తమ వినతిలో భాగంగా క్రింది డిమాండ్లు చేశారు:ఆర్‌డీఎస్ ఎడమ కాలువలో గండ్లు, లీకేజీలు మరియు దెబ్బతిన్న ప్రాంతాల మరమ్మతులు వెంటనే చేపట్టాలి.కాలువలో పేరుకుపోయిన మట్టి, చెత్త తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చూడాలి.చివరి ఆయకట్టు గ్రామాలకు సమానంగా సాగునీరు అందించేలా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి.రైతులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి.కాలువ ఆధునీకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి.రైతుల జీవనాధారం వ్యవసాయం మాత్రమే కావున ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలోవీరేష్ గంగాధర్ తిప్పా రెడ్డితో పాటు గ్రామ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.