మొక్కజొన్న ధాన్యాన్ని కాంట చేసిన బస్తాలను తక్షణమే ప్రభుత్వ గోదాములకు పంపిణీ చేయాలి

May 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 12 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ మొక్క ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మొక్కజొన్న మార్కెట్లో మొక్కజొన్న చేసిన బస్తాలను తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్, జిల్లా అధ్యక్షులు కాజాలు పరిశీలించడం జరిగింది. మరియు మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతాంగ సమితి మార్కెట్లో సందర్శించడం జరిగింది. మక్కజొన్న రైతుల సమస్యలు దాదాపు నెల రోజుల క్రితం మక్కా ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పోశాం.తీసుకువచ్చిన మొక్క ధాన్యాన్ని పది రోజుల క్రితం కాంటా చేశారు.గన్ని బ్యాగ్స్, హమాలీ ఖర్చు, దింపడం, ఎత్తడం, ఖర్చు మొత్తం రైతులే భరిస్తున్నారు. తూకం చేసిన మొక్కజొన్నను మార్కెట్ నుండి 15 రోజులు గడిచిన మార్కెట్ నుండి లారీలకు ఎత్తడం తరలించడం లేదు. మార్కెట్ నుండి నింపిన బస్తాలను తరలించిన తర్వాతనే రైతులు ఇక్కడి నుంచి మీ ఇంటికి పోవాలి లారీలకు బస్తాలను (ఎత్తేదాక) తరలించేదాకా మీ ధాన్యం మీరే బాధ్యత అని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఆకాల వర్షాలు పడి మొక్క ధాన్యం తడిసిపోతే రైతాంగం తీవ్ర కష్టాలు పడవలసి వస్తుంది నెల రోజులు గడుస్తున్న ఇక్కడే ఉండి మక్కజొన్న సంచులకు కావలి కాస్తున్నాం అని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో మంచినీటి వసతి లేదు విశ్రాంతి గదులు లేవు రైతులకు ఎటువంటి వసతులు లేవు రాత్రిపూట దోమల బెడద తీవ్రంగా ఉన్నది రకరకాల సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంటా చేయని30% మొక్కజొన్నలను ఇంకా తూకం చేయలేదు.తూకం వేసిన బస్తాలను ప్రభుత్వం వెంటనే తీసుకెళ్లాలి మరియు కాంట చేయని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేస్తున్నది కార్యక్రమంలో మొక్కజొన్న రైతులు మిట్టదొడ్డి, కొండపల్లి, ఎన్కంపల్లి సోమేశ్వర్ రెడ్డి శేఖర్, శంకర్, కొండపల్లి పరశురాం, కాసిం, సిద్ధనూరు తదితర రైతులు ఉన్నారు.

📰 ePaper