హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్, తీసుకెళ్లాలి – శ్రీ మారుతి కిరణ్ బూనేటి గారు.
జనం న్యూస్ జూలై 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ( ఇంచార్జి ) గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తో కలిసి పాల్గొన్న బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,* హిందూ ధర్మం, సంస్కృతి, స్వాభిమానాన్ని కాపాడేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఛత్రపతి శంభాజీ మహారాజ్ తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. వారి త్యాగాలు, వీరత్వం ప్రతి హిందువుకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.హిందూ సమాజం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సాధ్యమైనంత వరకు హిందూ వ్యాపారుల వద్ద నుంచే కొనుగోళ్లు చేసి, వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా ఉంటేనే ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలంగా కాపాడగలమని అన్నారు.ఈ కార్యక్రమంలో* హిందుత్వ భావజాలాన్ని విశ్వసించే నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.