బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
జనం న్యూస్ జులై 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రిక్షా పుల్లర్స్ కాలనీలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, “బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానేత. అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని పేర్కొన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, బాబు, ప్రవీణ్,జగదీష్ గౌడ్, యశ్వంత్, రాoచందర్,రమేష్, మల్లేష్, వినయ్,వేముల రవి, యాకన్న,రాజు, పింటూ,సోమేష్, రామ్మూర్తి,వినోద్, మాధవి రెడ్డి, కరుణ, రాధిక, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.