జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ఫీజులలో రాయితీ కల్పించాలి-టియుడబ్ల్యూజే (ఐజేయు)

July 6, 2026 | తెలంగాణ

టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన వినతి పత్రాలు అందజేత

జనం న్యూస్-జులై 6- నాగార్జునసాగర్ టౌన్-నల్లగొండ జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆదేశానుసారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో సోమవారం నాడు విలేకరుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో స్థానిక ఎమ్మార్వో అందుబాటులో లేని కారణంగా డిటి లక్ష్మీనారాయణకి మరియు మండల విద్యాధికారి శ్రీనివాసులుకి వేరువేరుగా వినతి పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం టియుడబ్ల్యూజే (ఐజేయు) నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు నంది బిక్షం, కటికర్ల మల్లయ్య, నర్సింగ్ వెంకటేశం, ఆకనబోయిన రవిశంకర్, మెగా వత్తు శత్రు నాయక్, షేక్ అబ్దుల్లా, జూపల్లి ప్రశాంత్, తిరిగి రాఘవయ్యతోపాటు నాగార్జున సాగర్ పాత్రికేయులు పాకాల నరసింహ, రవీంద్ర ప్రసాద్ భూపతి, యోబు రాజు తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper