దోమల నివారణతోనే ఆరోగ్య రక్షణ మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్

July 10, 2026 | తెలంగాణ

జ నం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 10-07-2026 శుక్రవారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆరో వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేష్, స్థానిక కౌన్సిలర్ తాటికొండ కృష్ణ హాజరయ్యారు.​ఈ సందర్భంగా వారు వార్డులోని పలు వీధుల్లో పర్యటించి, ఇళ్ల మధ్య నిలిచిన నీటిని పరిశీలించారు. అనంతరం చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన దోమల వ్యాప్తిని అరికట్టడానికి శుక్రవారం రోజున ఇళ్లలోని కూలర్లు, సిమెంట్ తొట్లు, పూల కుండీలలోని నీటిని తప్పనిసరిగా తొలగించి ‘డ్రైడే’ పాటించాలన్నారు.​మున్సిపల్ కమిషనర్ గణేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది నిరంతరం దోమల నివారణకు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లే పనులను చేపడుతున్నారని, ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. కౌన్సిలర్ తాటికొండ కృష్ణ మాట్లాడుతూ తమ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.​ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో పాటు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.END

🌐 Select Language:
📰 ePaper