ద్రాక్షారామం అగ్ని ప్రమాద బాధితులకు రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేయూత**రూ.1.72 లక్షల విరాళం అందజేత

July 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 10 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాద్రాక్షారామం మార్కెట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు ది రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూ.1,72,316 మానవతా విరాళాన్ని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంకు అందజేశారు.అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మొత్తం 48 మంది బాధిత వ్యాపారులకు ఈ సహాయాన్ని అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపుమేరకు వ్యాపారులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు అందిన ప్రతి రూపాయి వారి పునరావాసానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొవ్వూరి తాతారెడ్డి, కార్యదర్శి పసుపులేటి వీరవెంకట సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు కంచుమర్తి బాబురావు, ది రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper