జోగుళాంబ గద్వాల్ నియోజక వర్గ ఎమ్మెల్యే సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నది ఏమనగా*
జనం న్యూస్ 10 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నేడే డయల్ యువర్ గద్వాల ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఉ10 గంటల నుండి 11గం ల వరకు ప్రజల సమస్యలను తెలుసుకోనుటకు మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ గంటే సమయం కేటాయించడం చింతించాల్సిన విషయం.చాలామందికి మీకు 9440256611 నెంబర్కు డయల్ చేసినప్పుడు బిజీబిజీ అని చెప్పడంతో వారి సమస్యలను మీతో చెప్పుకోలేకపోయారు అందులో నేను కామ్రేడ్ రంగన్న ఎలుకూరు అనే వ్యక్తిని ఒకరిని. నా ఫోన్ మీతో కనెక్ట్ అయివుంటే నేను ఈ క్రింది సమస్యల గురించి మీతో వివరించాలి అనుకున్నా కానీ నాకు మీ ఫోన్ బిజీ బిజీ అని చెప్పింది.అయిన నేను చెప్పాలనుకున్న విషయాలను సోషల్ మీడియా ద్వార మీకు తెలుపుతున్నాను. విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయి వైద్య రంగంలో కూడా చాలా సమస్యలున్నాయి మన పెద్ద ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. రోగులకు స్కానింగ్ చేసే డిపార్ట్మెంట్లో రోజుకు 30 మందికే స్కానింగ్ అనే నిబంధనను తొలగించి 100మందికి పెంచుతూ ఆసుపత్రిలో రోగులకు సరైన మందులు అందుబాటులో లేవు బయటకి వెళ్లి తెచ్చుకుంటున్నారు రోగులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుకుంటున్నాను. మెడికల్ కాలేజీ పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎందుకు కాలేజీ నడవడం లేదు. ఉపాధి విషయాలలో విరోచితమైన అవకాశాలు చదువుకున్న యువతకు కల్పించండి జోగుళాంబ గద్వాల్ లో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.మన గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నిన్న జరిగిన ఉలిగేపల్లి దారునహత్య కేసు అది రాజకీయ హత్య ఆ హత్య వెనుక ప్రధాన సూత్రదారులు ఎవరో హత్య చేయడానికి, చేయించడానికి ఎవరు బలమిచ్ఛారో వారిని *సిబీఐ* ఎంక్వయిరి మీ ద్వారా చేయించి భవిష్యత్తులో మన ప్రాంతంలో ఇలాంటి హత్యలు జరగకుండా చూడాలని ప్రజల విన్నపం మీ పేరు వాడుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు అధికారులు రైతుల పంచాయితీలు డబ్బులు తీసుకుని సెటిల్ మెంట్లు చేస్తూ న్యాయం జరిగే వాళ్లకు అన్యాయం చేస్తూ ఎంఎల్ఏ అయినా మీ పేరు వాడుకుని మీకు చెడ్డ పేరు తెస్తున్నారు. గద్వాల్ లో ఎవరయినా ప్రజలు వారి సొంత ఆస్తులు భూములు అమ్ముకునే సమయంలో ఆస్తి కోటి రూపాయల విలువ చేస్తే మీ పేరు చెప్పి రైతుల ఆస్తి కోటి రూపాయల విలువ చేసే దానిని 60 లక్షలు ఇస్తాము 50 లక్షలు ఇస్తాము ఇది మా ఎమ్మెల్యే మాట అని చెబుతూ కొంతమంది గద్వాల్ నియోజకవర్గంలో ఈ కోణంలో కూడ మీకు చెడ్డ పేరును తీసుకొస్తున్నారని సమాచారం.వీరిపై కూడ మీరు ఉక్కు పాదం మోపాలని సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎవరాస్తి వాళ్లది వాళ్లకు స్వతంత్రంగా అమ్ముకునే హక్కు,అవకాశం,అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ల స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని మరి మరి ప్రజాస్వామ్యబద్ధంగా మన గద్వాల్ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఇందిరమ్మ ఇళ్ళను నిజమైన పేదలకు, అర్హులకు కేటాయించాలని కోరుతున్నాను. ఈ మధ్య వర్షాలు కురవకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారు. జూరాలకు జూరాల పైన ఉన్న ఆల్మట్టి డ్యామ్ నుండి మన ప్రాంతానికి నీళ్లను తీసుకొచ్చి మన రైతుల ముఖంలో కలను నింపాలని కోరుకుంటున్నాను.అనేక మారు మూల గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు లేవు వాటికి పెద్దపీట వెయ్యాలని కోరుకుంటున్నాను.ఎల్కూరు గ్రామంలో కావచ్చు మన గద్వాల్ జిల్లాలో కావచ్చు తాతల ముత్తాతల కాలం నాడు నోటి మాటలకు కొన్న ఆస్తులు ఇంకా కబ్జాలో ఉన్నవారికి ఇలాంటి ఆస్తులు ఆన్లైన్ రికార్డు కాలేదు ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఎద్దుల కల్లాలు(దొడ్లు) ఇనాం భూములంటూ ఇప్పటికీ కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పట్టా భూములుగా ఉన్న భూములు నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవి ఇనాము భూములుగా పరిగణిస్తూ పది సంవత్సరాల కాలంగా ఇంకా రైతులు మనోవేదనకు గురవుతున్నారు. వీటి పరిష్కారం కు కూడ మీరు ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వమే రైతులకు స్వయంగా ORC ఇచ్చి ప్రభుత్వమే రైతులకు ఇనాం భూములను పట్టా భూములుగా మార్చుటకు పెద్ద పీట వెయ్యాలని బాధితుల తరపున వేడుకుంటున్నాను. ఇంకా మరెన్నో మన ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ శ్రీకారం చుట్టాలని ప్రజల తరఫున చేతులెత్తి వేడుకుంటున్నాను