గురుకులాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి-పెరుమాళ్ళ వెంకటేశం తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటిఎఫ్) సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనం న్యూస్ -జూలై 10- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటిఎఫ్) పెదవుర మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పిఆర్ సి రిపోర్టును తెప్పించి పిఆర్ సి ని ప్రకటించాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్, డి ఏ ఏరియర్స్ తక్షణమే మంజూరు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేజీబీవీ మరియు గురుకుల పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సమస్యలను పరిష్కరించని పక్షంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి పిలుపునివ్వడంలో ఏమాత్రం వెనకాడబోమని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పెరుమాళ్ళ వెంకటేశం, యుటిఎఫ్ సీనియర్ కార్యకర్తలు సహదేవి, మన్నెం వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, మండల అధ్యక్షులు రామావత్ కృష్ణ, జనరల్ సెక్రెటరీ గోలి కృష్ణ, కోశాధికారి చైతన్య, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ కోనేటి నరసింహ, సోషల్ మీడియా కన్వీనర్ కోనేటి కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.