డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు* *- మేరా యువ భారత్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు
*జనం న్యూస్ జూలై ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్*కోనసీమ :* జిల్లాకేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ సంస్థ డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సమితి సమన్వయకర్త మేజర్ పి.సరదా మాట్లాడుతూ డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6న జన్మించారని తెలిపారు. ఆయన ప్రముఖ జాతీయవాద నేతలలో ఒకరని, 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని బలంగా విశ్వసించిన ముఖర్జీ హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లలో సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. దేశంలో తొలి భారతీయ జాతీయవాద రాజకీయ పార్టీని స్థాపించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారని అన్నారు.కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కతాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, స్వాతంత్ర్యానికి ముందు జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953న మరణించే వరకు కొనసాగారు.ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఎం.వెంకటేశ్వరరావు, మేరా యువ భారత్ స్వచ్ఛంద సేవకులు సరోజిని, అనూష నిర్వహించారు.