ముప్పై ఏళ్ల పండుగ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జనం న్యూస్ 13 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పట్టు వస్త్రాలతో ఉపాధ్యాయులకు నారికేళ సన్మానం 30 ఏళ్ల అనుభవాలను నెమరేసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1996-97 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పట్టణంలోని అనంత ఫంక్షన్ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పట్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శాలువా పూలమాలలతో పట్టు వస్త్రాలు మరియు పండ్లు ఫలహారాలతో నారీకేల ఘనంగా సన్మానం చేశారు. ముప్పై ఏళ్ల తర్వాత చదువు చెప్పిన ఉపాధ్యాయులను గుర్తించుకొని వారిని స్వయంగా తీసుకొచ్చి ఇలా సన్మానించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, మా జీవితంలో ఇది ఒక తీపి గుర్తుగా గుర్తించుకుంటామని ఉపాధ్యాయులు తమ సంతోషం వెలిబుచ్చారు భవిష్యత్తులో పూర్వ విద్యార్థులు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.